కార్తీక పౌర్ణమి విశేషము
కార్తీక పౌర్ణమి శ్రీ మహా విష్ణుమూర్తి , మహా శివునకు కు అత్యంత ప్రీతికరమైన మాసము. ఈరోజు దీపారాధనకు విశేష ప్రాముఖ్యముంది. విష్ణు ఆలయాల్లో గోపురం మీద, ధ్వజస్తంభం ఎదుట, తులసికోట దగ్గర, దేవుడి సన్నిధిలోనూ ప్రమిదల్లో, ఉసిరికాయలమీద,బియ్యం పిండితో చేసిన ప్రమీదలలో దీపాలు వెలిగించాలి. శివాలయాల్లో ధ్వజస్తంభం దగ్గర అఖండదీపాన్ని,అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి చెరువులలో,నదులలో మొదలగు జల వనరుల్లో విడిచి పెట్టాలి.ఇలాచేయడం పుణ్యప్రదము,అష్టశ్వర్యాలు కలుగుతాయి.నదీ , సముద్ర , చెరువు లలో స్నానము ఆచరించాలి,తరువాత దైవ దర్శనం , …