వారము రోజుల విశేషములు

  • ఆదివారం : రాజకార్యములు. ఉద్యోగప్రయత్నములు, కోర్టుపనులు, విక్రయపనులు, విద్యారంభం. సీమంతములకు మంచిది.
  • సోమవారం : అన్నప్రాశన, కేశఖండన. అక్షరాభ్యాసం, యాత్రలు, బావులు తవ్వుటకు, ప్రతిష్టాదులు, విత్తనములు చల్లుట, ఉద్యోగ, ఉపనయన, గృహారంభములకు మంచిది.
  • మంగళవారం : శుభకార్యాలకు మంచిది కాదు. అగ్నిసంబంధ పనులు, పొలం దున్నుట, అప్పుతీర్చుట, సాహసకార్యములు, ఆయుధ విద్యలకు మంచిది.
  • బుధవారం : సమస్త శుభకార్యాలకు, ప్రయాణాలకు, నూతన వస్త్రదారణకు, గృహారంభ, గృహప్రవేశ, దేవతా ప్రతిష్టాదులకు, హలకర్మ, విత్తనములు జల్లుతకు, క్రయ విక్రయాది వ్యాపారాది పనులకు, అప్పుచేయుటకు, ఉద్యోగములో చేరుటకు మంచిది.
  • గురువారం : సమస్త శుభకార్యములకు మంచిది. వివాహ యాత్రాధులకు, నూతన వస్త్ర ఆభరణ ధారణకు, గృహారంభం, గృహప్రవేశ దేవతాప్రతిష్టాదులకు, చెరువులు, తవ్వుటకు, పదవీస్వీకారం చేయుటకు మంచింది.
  • శుక్రవారం : వివాహాది శుభకార్యాలకు పంచదశ సంస్కారాలకు, క్రయవిక్రయాది వ్యాపారాలకు, ఔషధసేవకు, స్త్రీలకు సంబంధించిన కార్యక్రమాలకు, లలిత కళలు అధ్యయనం చేయుటకు మంచిది.
  • శనివారం : ఇనుము, ఉక్కు సంబంధిత పనులకు, నూనె వ్యాపారమునకు, స్థిరాస్తులను అమ్ముటకు, ఉద్యోగ స్వీకరణకు మంచిది. గృహారంభం, గృహప్రవేశ వివాహాదులకు మాధ్యమం.

సిద్ధాంతి

సిద్ధాంతి