రవి గ్రహము గురించి


సూర్యుడు నవ గ్రహాలలో మొదటి గ్రహం. సూర్యుడిని జ్యోతిష శాస్త్రంలో రవి అని వ్యవహరిస్తారు.

సూర్యుడు పురుష గ్రహం.

జ్యోతిష శాస్త్రంలో రవిని పాపి గా పరిగణిస్తారు.

రవి గ్రహము రాశి చక్రంలో సింహం స్వ స్థానము గా, మేషంలో ఉచ్ఛ స్థితిలోను, తులలో నీచ స్థితిలోనూ ఉంటాడు.
రవి కి ఉన్న ఇతరనామాలలో కొన్ని అర్కుడు, ఆదిత్యుడు, అరుణుడు, తపసుడు, పూష, హేళీ, భానుడు, దినకరుడు, మార్తడుడు.

జ్యోతిష శాస్త్రంలో సూర్యుని జాతి క్షత్రియ,

జ్యోతిష శాస్త్రంలో సూర్యుని తత్వం అగ్ని,

జ్యోతిష శాస్త్రంలో సూర్యుని వర్ణం రక్తవర్ణం

జ్యోతిష శాస్త్రంలో సూర్యుని గుణం రజోగుణం,

జ్యోతిష శాస్త్రంలోసూర్యుని స్వభావం స్థిర స్వభావం,

జ్యోతిష శాస్త్రంలో సూర్యుడు కారకత్వం వహించే రుచి కారం,

జ్యోతిష శాస్త్రంలో సూర్యుని స్థానం దేవాలయం

జ్యోతిష శాస్త్రంలో సూర్యుడు కారకత్వం వహించే జీవులు పక్షులు,

రవి ఆధిపత్య దిక్కు తూర్పు,

రవి నిర్జలుడు,

రాగి రవి లోహము ,

రవి గ్రహ రాజు, రవి ఆత్మాధికారం కలిగి వుంటాడు.

శరీరములో ఎముకలు రవి ఆధీనములో వుంటాయి , రవి స్వరూపము తండ్రి, శ్యాల వర్ణం కలిగిన వాడు , రవి వలన కలిగే ఆరోగ్య సమస్యలు శిరోవేదన, శరీర తాపం,

గృహంలో ముఖ ద్వారం, పూజా మందిరం రవిస్థానములు ,

రవి రాజు గురువు లకు బలము , పగటి సమయం కాల బలం, దశమ స్థానం దిక్బలము , మకరం, కుంభం శత్రు క్షేత్రములు,

వృశ్చికం, ధనస్సు, మకరం విషమ క్షేత్రములు. మీనము మిత్రక్షేత్రం . మిధునం, కన్య లు సమ క్షేత్రములు.


రవి సింహ రాశిలో 20 డిగ్రీలలో మూల త్రికోణంలోనూ,

మేష రాశిలో 10 డిగ్రీలలో పరమోచ్ఛలోను,

తులా రాశిలో 10 డిగ్రీలలో పరమ నీచను పొందుతాడు.

కుజుడు, చంద్రుడు, గురువు మిత్రగ్రహాలు.

శుక్రుడు, శని శత్రు గ్రహాలు .

బుధుడు సమ గ్రహం. 1 డిగ్రీ దిన చలనం కలిగివుంటాడు. 30 రోజులు ఒక్కొక్క రాశిలో ఉంటాడు,

రాశి మొదటి భాగములో శుభాన్నిస్తాడు, గ్రీష్మ ఋతువు లో శుభాన్నిస్తాడు ,గ్రహ ప్రకృతి :- పిత్తము.

దిక్బలం :- దక్షిణ దిక్కు., రవి ఆజానబాహుడు,

సిద్ధాంతి

సిద్ధాంతి